ఔరంగజేబు మూడో పెళ్ళాం పేరేంటి? కసబ్ నేటివ్ ప్లేస్ ఏది? కౌరవులు వంద మంది పేర్లు ఏమిటి? నువ్వు ఎక్కి వచ్చిన మెట్లెన్ని? ఇలా ఉంటాయి కొన్ని ఇంటర్వ్యూ లలో ప్రశ్నలు. ప్రభుత్వం లో చేసే అటెండర్ పనికి, ఫైళ్ళు ఆ బల్ల మీద నుండి ఈ బల్ల మీద పెట్టే పనులకి కూడా ఉద్యోగం రావాలంటే ఇంటర్వ్యూ ఎదుర్కోవాలి. ఇంటర్వ్యూ చేసేవాళ్లతో అండర్ స్టాండింగ్ కి వస్తే బాహుబలి లో హీరో ఎవరు? అన్నంత ఈజీ ప్రశ్నలు అడుగుతారు. లేదు వాళ్లకి ముట్టాల్సింది ముట్టకపోతే కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు? లాంటి కష్టమైన ప్రశ్నలు అడుగుతారు. అందుకే వ్రాత పరీక్షల్లో అదిరిపోయే మార్కులు తెచ్చుకునేవాళ్ళు కూడా ఇంటర్వ్యూ అంటే భయపడిపోతారు. రికమెండేషన్ల కోసం పరుగులు పెడతారు. లంచాలు ఇవ్వడానికి ఆస్తులు అమ్ముకుంటారు. చిన్న చిన్న ఉద్యోగాలకి కూడా ఇలాంటి ఇంటర్వ్యూ లు అవసరమా అని చాలాకాలంగా నిరుద్యోగులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న మన ప్రధాని మోది కి కూడా వినిపించినట్లుంది. మోది ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలకి ఇంటర్వ్యూ లు లేకుండా కేవలం వ్రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. నిన్న దేశ ప్రజల నుద్దేశించి మన్ కి బాత్ అనే రేడియో కార్యక్రమం లో మాట్లాడుతూ మోది ఈ విషయం చెప్పారు. బహుశః సెప్టెంబర్ ఆఖరుకి ఈ దిశగా ప్రభుత్వ ఉత్తర్వులు రావచ్చని ఆశిస్తున్నారు.
For More Details :Click Here