..
/


సాధారణంగా సెప్టెంబర్ నెల నుంచి క్యాంపస్ నియమాకాలు మొదలవుతాయి. కానీ, ఈసారి దానికి భిన్నంగా ఆగస్టు చివరి వారల నుంచి ఈ సందడి కనిపిస్తుంది. ఇప్పటికే TCS, COGNIZANT, IBM, TECH MAHINDRA, POLARIS, WIPRO లాంటి సంస్థలు క్యాంపస్ నియామకాలకు పచ్చజెండా ఊపాయి. పేరున్న కళాశాలల్లో ఇప్పటికే ఒకటి రెండు కంపెనీలు అభ్యర్ధులను ఎంపిక చేసుకున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని నియామకాలు ఖశ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. దానికి ఇప్పటినుంచే ప్రిపేర్ అయితే బావుంటుంది.
ఈ కాంపిటీషన్ యుగంలో SOFTWARE కొలువు సాధించడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారమే. అయితే పట్టుదల, ప్రణాళిక ప్రకారం విశ్లేషణాత్మకంగా చదివితే సాఫ్ట్ వేర్ కొలువును సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటికే ఈ సంవత్సరం ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు ఉద్యోగాల వేట మొదలు పెట్టారు. కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయ్యారు. మరో వైపు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న బ్యాచ్ చివరి సెమిస్టర్ ప్రాజెక్ట్ వర్క్ లో ఉన్నారు. వీరు కూడా మరికొద్ది రోజుల్లో 2015 బ్యాచ్ వారికి జతకానున్నారు.
ముఖ్యంగా ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ వీరందరినీ ఫ్రెషర్స్ గా ఉద్యోగాల్లోకి తీసుకోనున్నాయి. అయితే ఉద్యోగ సంస్థలు ఆశించే నైపుణ్యాలున్న అభ్యర్ధుల కోసం వడపోత తప్పనిసరిగా ఉంటుంది. PRELIMINARY ROUND, TECHNICAL ROUND, HR ROUND ఉండే అవకాశం ఉంటుంది. కంపెనీ విధానాలను బట్టి ఒకటి రెండు ఎక్కువ రౌండ్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని కంపెనీలు గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించే అవకాశం ఉంటుంది.
మరి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి.. వివరాలు తరువాతి పేజీలో..

For more jobs : Click Here